Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గుండు తుడిచేందుకు ప్రత్యేకంగా ఓ మనిషి.. లలితా జ్యువెలర్స్ అధినేత వీడియో వైరల్

Lalitha Jewellers Owner Kiran Kumar Viral Video
Advertisement
--
Advertisement
‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు..’ అనే డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫేమస్ అయిందో తెలిసిందే. లలితా జ్యువెలర్స్ వారి ప్రకటనలో కనిపించే గుండు బాస్ (కిరణ్ కుమార్) ఈ ఒక్క డైలాగ్ తో ఎంతో ఫేమస్ అయ్యారు. మిగతా జ్యువెలర్స్ మాదిరి కాకుండా తన దుకాణానికి సంబంధించిన యాడ్ లో తనే నటించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితుడయ్యారు. ప్రస్తుతం ఈ గుండు బాస్ కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎక్కడ, ఎప్పుడు జరిగిందనే వివరాలు తెలియరాలేదు కానీ, ఓ ఫంక్షన్ కు హాజరైన కిరణ్ కుమార్ ఓ వ్యక్తితో మాట్లాడుతుండడం ఈ వీడియోలో కనిపించింది. వెనక ఉన్న వ్యక్తిగత సిబ్బందిలో ఒకరు కిరణ్ కుమార్ గుండుపై పట్టిన చెమటను ఎప్పటికప్పుడు చిన్న టవల్ తో తుడవడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కిరణ్ కుమార్ గుండు తుడవడమే తన పని అన్నట్లు ఆ సిబ్బంది వ్యవహరించారు.

నాని అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేస్తూ ‘జీవితంలో ఎంత సంపాదించాలంటే.. ఇదిగో ఇలా గుండుకు పట్టిన చెమటను తుడిచేందుకు ఓ ఉద్యోగిని పెట్టుకునేంతగా’ అంటూ క్యాప్షన్ జోడించాడు. ఈ క్యాప్షన్ కు తోడు గుండు బాస్ చెమట తుడుస్తున్న దృశ్యాలను చూసి నెటిజన్లు ఈ వీడియోను తెగ వైరల్ చేశారు. ఈ వీడియోకు చాలా మంది నవ్వుతున్న ఎమోజీలతో, మరికొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఇదీ అన్నా లైఫ్ అంటే..’ అని ఒకరు, ఆ ఉద్యోగం నాకిప్పించండి అని మరొకరు.. డిఫరెంట్ హెయిర్ స్టైల్ కంటే గుండును మెయింటెన్ చేయడమే చాలా ఖర్చుతో కూడుకున్న పని అంటూ మరొక యూజర్ కామెంట్ పెట్టాడు.
Advertisement
Advertisement
lalitha jewellers
Gundu boss
Dabbulu Urike Ravu
Viral Videos

More Telugu News